న్యూఢిల్లీ: పోలండ్‌కు చెందిన కరోలినా బిలస్కా (Karolina Bielawska) మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నది. ప్యూర్టోరికోలోని షాన్‌జువాన్‌లో జరిగిన 70వ ఎడిషన్ మిస్ వరల్డ్ 2021 పోటీల్లో కరోలినా విజేతగా నిలిచింది. అమెరికాకు చెందిన ఇండియన్ ఆరిజన్ శ్రీ సైనీ మొదటి రన్నరప్‌గా, కోట్ డి ఐవరీకి చెందిన ఒలివియా యాస్ రెండో రన్నరప్‌గా నిలిచింది.
Our Miss World 2021 is Karolina Bielawska from Poland! #missworld pic.twitter.com/jYkjbylUub
— Miss World (@MissWorldLtd) March 17, 2022
షాన్ జువాన్లోని కొకొ కోలా మ్యూజిక్ హాల్లో జరిగిన వేడుకల్లో 69వ ఎడిషన్ విజేత టోని ఆన్ సింగ్.. కరోలినాకు ప్రపంచ సుందరి కిరీటాన్ని బహూకరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విజేతగా తన పేరు విన్నప్పుడు షాక్ అయ్యానని, ఇప్పటికీ తాను నమ్మలేకపోతున్నానని చెప్పారు. మిస్ వరల్డ్ కిరీటాన్ని ధరించడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పింది.
Our newly crowned Miss World Karolina Bielawska from Poland with 1st Runner Up Shree Saini from United States 2nd Runner up Olivia Yace from Côte d’Ivoire#missworld pic.twitter.com/FFskxtk0KO
— Miss World (@MissWorldLtd) March 17, 2022
కాగా, కరోలినా ప్రస్తుతం మేనేజ్మెంటులో పీజీ చేస్తున్నది. తర్వాత పీహెచ్డీ చేస్తానని, అదేవిధంగా మోడల్‌గా కొనసాగుతానని తెలిపింది. బ్యాడ్మింటన్, టెన్నిస్, స్కూబా డైవింగ్, స్విమ్మింగ్ చేయడాన్ని ఆమె అమితంగా ఇష్టపడుతుంది.