ఎట్టకేలకు పాక్ నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది. తాను నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనని రాష్ట్రపతి ఆరిఫ్ ఆల్వీ భీష్మించుకు కూర్చోవడంతో సెనెట్ చైర్మన్ సాదిఖ్ సంజరాని కొత్త కేబినెట్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే నూతన మంత్రులతో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించనని అనడంతో ప్రమాణ స్వీకారం వాయిదాపడుతుందన్న పుకార్లు వచ్చాయి. అయితే.. సెనెట్ చైర్మన్ ప్రమాణ స్వీకారినికి ముందుకు రావడంతో కీలక ఘట్టం పూర్తైంది. 31 ఫెడరల్ మంత్రులు, ముగ్గురు సహాయ మంత్రులు, ముగ్గురు సలహాదారులతో ఈ కొత్త కేబినెట్ రూపుదిద్దుకుంది.