బ్రెసికా: ఇటలీలో విమానం ప్రమాదం(Plane Crash) జరిగింది. హైవేపై అది కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. బ్రెసికా సిటీ సమీపంలో ఈ ఘటన జరిగింది. చిన్న తరహా అల్ట్రాలైట్ ఎయిర్‌క్రాఫ్ట్.. రోడ్డుపై అకస్మాత్తుగా కూలింది. కూలిన తర్వాత భారీగా మంటలు వ్యాపించాయి. బాధితుల్లో 75 ఏళ్ల లాయర్ సెర్గియో రావగ్లియా, 60 ఏళ్ల భాగస్వామి అన్నా మారియా స్టెఫానో ఉన్నారు. బహుశా విమానం కంట్రోల్ తప్పి ఉంటుందని, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేద్దామనుకున్న సమయంలో.. ఆ విమానం నోస్‌డైవ్ చేసినట్లు భావిస్తున్నారు.
కిందకు డైవ్ చేస్తున్న సమయంలో ఆ విమానం హైవేను ఢీకొట్టింది. ఫ్రేషియా ఆర్జీ అల్ట్రాలైట్ విమానా్ని కార్బన్ ఫైబర్‌తో తయారు చేశారు. వింగ్ వెడల్పు 30 ఫీట్లు ఉంటుంది. చాలా వేగంగా ఆ విమానం రోడ్డును ఢీకొన్నట్లు సీసీటీవీ ఫూటేజ్ ద్వారా తెలుస్తోంది. విమానం పేలిన సమయంలో ఇద్దరు బైకర్లు గాయపడ్డారు.
Il video dell’ultraleggero che martedì mattina è precipitato su una delle due carreggiate del raccordo autostradale #CordaMolle in provincia di #Brescia.#aircrash pic.twitter.com/9pI6R1ezUq
— Fabrizio Hennig (@FabrizioHennig) July 23, 2025