న్యూఢిల్లీ: ఇటలీలోని బ్రెషియాలో మంగళవారం హైవేపై ఓ చిన్న విమానం కూలిపోయి ఇద్దరు వ్యక్తులు మరణించారు. మృతులను మిలాన్‌కు చెందిన 75 ఏండ్ల న్యాయవాది, పైలట్ సెర్జియో రవాగియా, ఆయన భాగస్వామి 60 ఏళ్ల ఆన్ మరియా డి స్టెఫానోగా గుర్తించారు.
ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తూ ఫెషియా ఆర్జీ తేలికపాటి విమానం నేరుగా రోడ్డును వేగంగా వచ్చి ఢీ కొన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే విమానం నుంచి దట్టమైన మంటలు వెలువడ్డాయి. అగ్నిమాపక శకటాలు అక్కడకు చేరుకోక ముందే విమానం పూర్తిగా దగ్ధమైపోయింది. విమానం హైవేని ఢీ కొని కాలిపోయిన దృశ్యాలను స్థానికులు వీడియో తీశారు.