క్వాలే: కెన్యా తీర ప్రాంతం క్వాలేలో ఇవాళ ఓ విమానం కూలింది(Plane Crash). మాసాయి మారా జాతీయ రిజర్వ్ ఫారెస్టుకు టూరిస్టులతో వెళ్తున్న విమానం కూలడంతో 12 మంది మృతిచెందినట్లు అధికారులు చెప్పారు. కొండలు, అటవీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. దయాని ఎయిర్ స్ట్రిప్‌కు 40 కిలోమీటర్ల దూరంలో విమానం కూలినట్లుగుర్తించారు. విమానం కూలిన ప్రదేశంలో సహాయక చర్యలు చేపట్టినట్లు క్వాలే కౌంటీ కమీషనర్ ప్టీఫెన్ ఒరిండే తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో 12 మంది ఉన్నారు. ఏ కారణం చేత విమానం కూలిందన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు.
12 people feared dead after a fixed wing aircraft carrying tourists crashed in Kwale. KCAA says the accident happened at 5.30 AM and the plane was heading to Kichwa Tembo from Diani.#KassNews pic.twitter.com/lroJMToiUZ
— KASS FM OFFICIAL (@Kass_FMOfficial) October 28, 2025