విమానంలో నిద్రపోయిన పైలట్లు… ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ మిస్సింగ్
అడిస్ అబాబా: ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానంలో పైలట్లు నిద్రపోయారు. దీంతో ఆ విమానం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కాలేదు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అప్రమత్తం చేసినప్పటికీ పైలట్లు స్పందించలేదు. ఆటో పైలట్ ఆఫ్ అయిన తర్వాత అలారమ్ మోగడంతో వారు మేల్కొన్నారు. ఈ నెల 15న ఇథియోపియాలో ఈ సంఘటన జరిగింది. ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈటీ343 విమానం సూడాన్‌లోని ఖార్టూమ్ నుంచి ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాకు బయలుదేరింది. ఆ విమానం 37,000 అడుగుల ఎత్తులో ఆకాశంలో ప్రయాణించింది. అయితే విమానాన్ని ఆటో పైలట్ మోడ్‌లో ఉంచి ఇద్దరు పైలట్లు నిద్రపోయారు.
మరోవైపు విమానం అడిస్ అబాబాలోని ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. పైలట్లు నిద్రలో ఉండటంతో విమానం అక్కడ ల్యాండ్ కాలేదు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అప్రమత్తం చేసినప్పటికీ నిద్రలో మునిగిన పైలట్లు స్పందించలేదు. దీంతో ఆ విమానం ఎయిర్‌పోర్ట్‌ను దాటి వెళ్లింది. అనంతరం ఆటో పైలట్ మోడ్ ఆఫ్ కావడంతో అలారమ్ మోగింది. దీంతో మేల్కొన్న ఇద్దరు పైలట్లు ఆ విమానం ఎయిర్‌పోర్ట్‌ను దాటినట్లు గ్రహించారు. దానిని వెనక్కి మళ్లించి రన్‌వేపై ల్యాండ్ చేశారు. దీంతో విమానం సుమారు 25 నిమిషాలు ఆలస్యంగా ఆ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది.

కాగా, ఈ సంఘటన నేపథ్యంలో ఆ విమానం రెండున్నర గంటల తర్వాత అక్కడి నుంచి తదుపరి గమ్యస్థానానికి టేకాఫ్ అయ్యింది. అయితే వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానంలో పైలట్లు నిద్రపోయిన వైనంపై విమానయాన నిఫుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

