విమానం ఏడు గంటలు ఆలస్యం… ప్రయాణికులపై అరిచిన పైలట్
లండన్: విమానం ఏడు గంటలకుపైగా ఆలస్యమైంది. ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ కాకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. దీంతో పైలట్ వారిపై అరిచాడు. కావాలనుకుంటే విమానం నుంచి దిగిపోవచ్చంటూ మండిపడ్డాడు. బ్రిటన్ రాజధాని లండన్‌లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 25న విజ్‌ఎయిర్ విమానం లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయం నుంచి సైప్రస్‌లోని లార్నాకాకు బయలుదేరాల్సి ఉంది. అయితే ఏడు గంటలకుపైగా ఆ విమానం టేకాఫ్ కాలేదు. దీంతో అందులోని ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు విమానంలో నిల్చొని పిచ్చాపాటిగా మాట్లాడుకోసాగారు.
ఇంతలో ఒక పైలట్ ప్రయాణికుల వద్దకు వచ్చాడు. విమానం ఆలస్యానికి తమ తప్పు కాదని చెప్పాడు. ఓపిక పట్టాలని, శాంతి వహించాలని కోరాడు. అయితే విమానం ఇంకా టేకాఫ్ కాకపోవడంపై కొందరు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ పైలట్ కూడా చిర్రెత్తాడు. తన సహనాన్ని కోల్పోయాడు. విమాన ప్రయాణికులపై రంకెలు వేశాడు. విమానం దిగిపోవాలని అనుకునేవారు చేతులు ఎత్తాలని అన్నాడు. ‘దయచేసి ఎవరు దిగాలనుకుంటున్నారో చేతులు ఎత్తండి. మీరు దిగితే మేం ఈ రాత్రికి వెళ్లం. నాకు, నా సిబ్బందికి ఇది అవసరం లేదు. ఈ విషయం మీకు తెలుసు. మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లడానికి మేం చేయగలిగినదంతా చేస్తున్నాం’ అని ఆ పైలట్ చెప్పాడు.
కాగా, హన్నా మేస్ అనే ప్రయాణికురాలు దీనిని తన మొబైల్ ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘విమానం ఏడు గంటలు ఆలస్యమైన తర్వాత ప్రయాణికులపై పైలట్ విరుచుకుపడ్డాడు. దిగిపోండి అంటూ అరిచాడు’ అని ఆమె పేర్కొంది. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 20 లక్షలకుపైగా దీనిని చూశారు. అయితే చాలా మంది నెటిజన్లు ఆ పైలట్‌నే సమర్థించారు. విమానం ఆలస్యం వల్ల ఆయన పడుతున్న బాధను కూడా అర్థం చేసుకోవాలని కొందరు పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Delay
- flyers
- get off
- Pilot shouts
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

