Beijing Skyscraper: వ్యక్తిగత కారణాల వల్ల.. 109 అంతస్తుల భవనాన్ని విమానంతో ఢీకొట్టిన పైలట్!
Beijing Skyscraper: బీజింగ్‌లోని 109 అంతస్తుల సీఐటీఐసీ టవర్‌ను విమానంతో ఢీకొట్టిన ఘటనపై చైనా సర్కారు ప్రకటన చేసింది. ఆ విమాన పైలట్ దీర్ఘకాల నిద్రలేమితో బాధపడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వ్యక్తిగత కారణాల వల్ల అతను ఆ చర్యకు పాల్పడినట్లు చెప్పింది.
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్‌లో ఉన్న 109 అంతస్తుల సీఐటీఐసీ టవర్(Beijing Skyscraper)ను కొన్ని రోజుల క్రితం ఓ చిన్న విమానం ఢీకొన్న విషయం తెలిసిందే. ఆ ఘటనపై ఇవాళ చైనా ప్రకటన చేసింది. టవర్‌ను విమానంతో ఢీకొట్టిన పైలట్.. దీర్ఘకాల నిద్రలేమి, ఆందోళనతో బాధపడుతున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. వ్యక్తిగత కారణాల కోసం అతను విమానంతో టవర్‌ను ఢీకొట్టినట్లు అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో పైలట్ మృతిచెందాడు. అతని పేరు లియూగా గుర్తించారు. ఆ ప్రమాదంలో 13 మంది గాయపడ్డ విషయం తెలిసిందే.
టవర్‌ను ఢీకొన్న పైలట్ వయసు 66 ఏళ్లు. అతను బీజింగ్ నివాసితుడు. విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్నట్లు చావోయాంగ్ జిల్లా ప్రభుత్వ అధికారి తెలిపారు. బలవన్మరణానికి పాల్పడాలన్న ఉద్దేశాన్ని పైలట్ లియూ తన డైరీలో రాసుకున్నట్లు తెలిసింది. వ్యక్తిగత కారణాల వల్ల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినట్లు అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఓ వ్యక్తిని డిశ్చార్జ్ చేశారు.
109 అంతస్తుల సీఐటీఐసీ టవర్‌ను చైనా జున్గా కూడా పిలుస్తారు. కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న జోంగ్నాన్హైకు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఆ భవంతి ఉన్నది. స్థానికులు ఆ టవర్‌ను ఓ అదృష్టంగా భావిస్తుంటారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

