బీజింగ్: ఒక వ్యక్తి నడుస్తుండగా అతడి బ్యాగ్‌లోని సెల్ ఫోన్ పేలింది. దీంతో మంటలు అంటుకోగా అతడు వెంటనే దానిని కింద పడేశాడు. ఈ ఘటన చైనాలో జరిగింది. మరోవైపు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఒక వ్యక్తి ఒక మహిళతో కలిసి రద్దీగా ఉన్న రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో అతడి బ్యాగ్‌కు మంటలు అంటుకున్నాయి. దీంతో అతడు దానిని కింద పడేశాడు.
బ్యాగ్‌కు మంటలు అంటుకునే ముందు పేలుడు శబ్దం వినిపించినట్లు అతడు తెలిపాడు. బ్యాగ్‌లో పేలిన మొబైల్ ఫోన్ శ్యామ్‌సంగ్ కంపెనీదని, దానిని 2016లో కొన్నట్లు చెప్పాడు. బ్యాటరీ సమస్యతో ఇబ్బంది పడుతున్నానని, అయితే అది పేలినప్పుడు ఛార్జింగ్‌లో లేదని వివరించాడు. మరోవైపు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
This is the shocking moment a phone catches fire inside a man’s bag in China. pic.twitter.com/4C5zz8Ov6t
— South China Morning Post (@SCMPNews) April 20, 2021