మనీలా : నేపాల్‌లో ప్రభుత్వ అవినీతిపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం.. ఇప్పుడు ఫిలిప్పీన్స్‌ను తాకింది. ప్రభుత్వ అవినీతి బాగోతాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం దేశ రాజధాని మనీలాలో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. వారిని నియంత్రించడానికి పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించాల్సి వచ్చింది.
వరద నియంత్రణ ప్రాజెక్టుల కోసం కేటాయించిన భారీ మొత్తంలోని(సుమారుగా రూ.83 వేల కోట్లు) డబ్బు.. ప్రభుత్వ పెద్దలు, అధికారులు, బడా వ్యాపారుల జేబుల్లోకి వెళ్లిందన్న ఆరోపణలు ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నాయి.