లాహోర్: పాకిస్థాన్‌లో పెంపుడు సింహం(Pet Lion) ఓ మహిళతో పాటు ఆమె ఇద్దరు పిల్లలపై దాడి చేసింది. ఆ ఘటనలో ఆ సంహాన్ని పెంచుతున్న ఓనర్‌ను అరెస్టు చేశారు. సింహం దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. లాహోర్ సిటీలోని ఓ సంపన్న ప్యామిలీకి చెందిన ఫార్మ్‌హౌజ్‌లో సింహాన్ని పెంచుతున్నారు. అయితే ఇటీవల ఆ సింహం ఆ ఇంటి గోడ దూకి.. బాటపై నడుచుకుంటున్న వెళ్తున్న వారిపై దాడి చేసింది. ఓ రెసిడెన్షియల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఓ మహిళపై ముందుగా దాడి చేసింది. ఆ తర్వాత ఆమె పిల్లలపై అటాక్ చేసింది. ఆ చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.
బోను నుంచి సింహం పరారీ అయ్యిందని, బుధవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసు ఆఫీసర్ ఫైసల్ కమ్రాన్ తెలిపారు. తన కుటుంబంపై సింహం దాడి చేస్తుంటే, దాని ఓనర్లు చూస్తూ ఉండిపోయినట్లు ఆ పిల్లల తండ్రి ఆరోపించాడు. తప్పించుకున్న సింహాన్ని పట్టుకుని ఫార్మ్‌హౌజ్‌కు తీసుకువచ్చారు. ఆ తర్వాత దాన్ని వన్యమృగ కేంద్రానికి తీసుకెళ్లారు. సంహాన్ని ఇంట్లో పెంచుకోవడం సంపన్న పాకిస్థానీ కుటుంబాల్లో స్టేటస్ సింబల్‌గా ఉంటోంది. చట్టపరమైన షరతులను అంగీకరించాల్సి ఉంటుంది. సింహం లాంటి జంతువును పెంచుకోవాలంటే భారీగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది.