‘సమానత్వం కోసం’ ప్రభుత్వ ప్రతిపాదన
జోహెన్నెస్‌బర్గ్ : మహిళలు, పురుషుల మధ్య సమానత్వం దిశగా అంటూ దక్షిణాఫ్రికా సంచలన ప్రతిపాదన చేసింది. స్వలింగ వివాహాలు, బహు భార్యత్వం ఇప్పటికే చట్టబద్ధమైన ఆ దేశంలో బహు భర్తృత్వాన్ని కూడా అనుమతించాలన్నదే ఆ ప్రతిపాదన. ఒకరి కంటే ఎక్కువ మంది భర్తలను కలిగి ఉండేందుకు మహిళలకు చట్టపరంగా అనుమతిన్వివడం వివాహ వ్యవస్థను మరింత సమ్మిళితం చేస్తుందంటూ ఆ దేశ హోంశాఖ పేర్కొనడం విస్తృత చర్చకు తెరలేపింది. ఈ ప్రతిపాదనపై సంప్రదాయవాదులు భగ్గుమంటున్నారు. వారిలో ప్రముఖ వ్యాపారవేత్త ముసా సెలెకు ఒకరు. ఆయనకు నలుగురు భార్యలు. బహు భర్తృత్వానికి అనుమతిస్తే ఆఫ్రికా సంస్కృతి ధ్వంసమవుతుందని ముసా అన్నారు. ‘అలాంటి జంటల పిల్లల పరిస్థితి ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు.