కాలిఫోర్నియా: పసిఫిక్ సముద్రంలో ఉన్న హవాయి(Hawaii) ద్వీపంలో సునామీ హెచ్చరికలను వెనక్కి తీసుకున్నారు. భారీ సునామీ విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు కొన్ని గంటల క్రితం అక్కడ ప్రభుత్వం ప్రకటన చేసింది. అయితే ఇప్పుడు ఆ హెచ్చరికలను స్థానిక ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. సునామీ వార్నింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేశారు. అడ్వైజరీ లెవల్‌కు మార్చినట్లు తెలిసింది. పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ దీనిపై స్పష్టత ఇచ్చింది. రష్యాలోని కమ్చట్కాలో ఇవాళ తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 8.8 తీవ్రతతో ఆ భూకంపం వచ్చింది. దీని వల్ల పసిఫిక్ తీర దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
సునామీ వార్నింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయడం అంటే.. అక్కడ బలమైన అలలు వచ్చే అవకాశం లేదని అర్థం. స్వల్ప స్థాయిలో వరదలు వస్తాయని, కొంత వరకు గట్టి తీరం వెంట అలలు ఉంటాయన్నారు. కానీ ప్రళయ భీకరమైన సునామీ హవాయి తీరాన్ని తాకే అవకాశం లేదని ప్రభుత్వం పేర్కొన్నది. సురక్షిత ప్రాంతాలకు తరలించిన వాళ్లు.. తమ ఇండ్లకు వెళ్లిపోవచ్చు అని హవాయి గవర్నర్ జోష్ గ్రీన్ తెలిపారు.
వాస్తవానికి సునామీ వార్నింగ్ రావడంతో .. హవాయి బీచ్‌లన్నీ అలర్ట్ అయ్యాయి. బీచ్‌ల్లో ఉన్న జనం.. హుటాహుటిన సురక్షిత ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఎత్తైన ప్రదేశాల దిశగా కదిలారు. దీంతో హవాయి వీధులన్నీ ట్రాఫిక్‌తో నిండిపోయాయి. రోడ్లపై వేల సంఖ్యలో కార్లు జమాయ్యాయి. తీవ్ర సునామీ హెచ్చరికలు వెనక్కి తీసుకున్న నేపథ్యంలో.. ప్రజలు నెమ్మదిగా, సురక్షితంగా తమ వాహనాల్లో స్వంత ఇండ్లకు వెళ్లిపోవాలని ఆదేశించారు.
It’s wild to see a Category 3 hurricane, a tropical storm, and a tsunami hitting near Hawaii all at once. That’s a rare and intense mix of natural events converging on one spot.#Tsunami Hawaii, Honolulu, Maui pic.twitter.com/yfO2910PHH
— Jose M (@JMLV51) July 30, 2025