న్యూయార్క్, సెప్టెంబర్ 29: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో శుక్రవారం కుండపోత వర్షం కురిసింది. ఆకస్మిక వరదలు సంభవించడంతో సబ్వే వ్యవస్థ నీట ముగిసింది. రహదారులు, వీధులన్నీ వరద నీటితో నిండిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ నేపథ్యంలో న్యూయార్క్ గవర్నర్ ఖాతీ హోచల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. లా గార్డియా విమానాశ్రయంలో విమానాలు ఆలస్యంగా నడిచాయి. రహదారులు నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీటిలో చిక్కుకుని వాహనాలు నిలిచిపోవడంతో పలువురు వాటిని అక్కడే వదిలేయడం కన్పించింది. కొందరు తమ వాహనాల్లో పలు గంటల పాటు చిక్కుకుపోయి సహాయం కోసం అర్థించారు. గురువారం రాత్రి సుమారు 13 సెంటీమీటర్లు, శుక్రవారం రోజంతా 18 సెంటీమీటర్ల వర్షం పడినట్టు గవర్నర్ తెలిపారు.