ప్రపంచంలో బాగా సంపాదించే వృత్తుల్లో వైద్య వృత్తి ఒకటి. సరైన స్కిల్స్ ఉంటే చాలు.. డాక్టర్లు బాగా సంపాదించేస్తారు. అలాగే సంపాదించిన ఒక డాక్టర్.. ఖరీదైన లంబోర్ఘినీ కారు కొన్నాడు. దీని ధర మార్కెట్లో సుమారు రూ. 2.5 కోట్లు ఉంటుంది. ఈ కారు కొన్న డాక్టర్ పేరు మికైల్ వర్షాస్కీ.
అందరూ ఆయన్ను డాక్టర్ మైక్ అని పిలుస్తారు. ఒకానొక సందర్భంలో ‘వరల్డ్ సెక్సీయెస్ట్ మ్యాన్’ పోటీలో కూడా పాల్గొన్నాడతను. డాక్టర్లలోనే అందగాడిగా పేరు తెచ్చుకున్నాడు. ‘హూ వాంట్స్ టు బి ఎ మిలియనీర్’ ప్రోగ్రాంలో పాల్గొన్నాడు. ఇటీవల ఒక బాక్సింగ్ మ్యాచ్‌లో పాల్గొని ఉక్రెయిన్ సహాయార్ధం లక్ష డాలర్లు కూడా పోగు చేశాడు.
ఇంత మంచి డాక్టర్‌గా పేరున్న మైక్.. ఈ నెల 6వ తేదీన తన అపార్ట్‌మెంట్‌కు వచ్చాడు. తన ఖరీదైన కారును పార్క్ చేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతని కారు కనిపించకుండా పోయింది. అదే సమయంలో తమ కార్లు తీసుకోవడానికి వచ్చిన ఇతర అపార్ట్మెంట్ వాసులకు అక్కడ ఉండాల్సిన సెక్యూరిటీ గార్డు కనిపించలేదు.
అతను ఎక్కడకు వెళ్లాడా? అని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే.. డాక్టర్ కారు తీసుకొని షికార్లు చేయడానికి వెళ్లిపోయాడు. న్యూయార్క్ సిటీ పోలీసుల సమాచారం ప్రకారం.. ఆ కారు నగరమంతా చక్కర్లు కొట్టింది.
తెల్లారి 6 గంటల సమయంలో మళ్లీ తిరిగొచ్చిన ఆ సెక్యూరిటీ గార్డు కార్ పార్క్ చేసేసి ఏమీ తెలియనట్లు కూర్చున్నాడు. దీనిపై స్పందించడానికి డాక్టర్ నిరాకరించారు. అలాగే ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.