Anne Hidalgo : ఫ్రెంచ్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా : అన్నే హిడాల్గో
Anne Hidalgo : ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌పై పోటీ చేయాలని తహతహలాడుతున్న వారి జాబితా పెరుగుతున్నది. ఈ జాబితాలోకి తాజాగా ప్యారిస్ మేయర్ అన్నే హిడాల్గో వచ్చి చేరారు..

ప్యారిస్ : ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌పై పోటీ చేయాలని తహతహలాడుతున్న వారి జాబితా పెరుగుతున్నది. ఈ జాబితాలోకి తాజాగా ప్యారిస్ మేయర్ అన్నే హిడాల్గో (Anne Hidalgo) వచ్చి చేరారు. వచ్చే ఏడాది జరుగనున్న ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు ప్యారిస్ మేయర్ సిద్ధమయ్యారు. ఫ్రెంచ్ వాయవ్య నగరమైన రూవెన్లో ఆమెనే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ‘ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్ష పదవికి అభ్యర్తిగా ఉండాలని నిర్ణయించుకున్నాను’ అని అన్నే హిడాల్గో ట్విట్టర్లో వెల్లడించారు. సోషలిస్ట్ పార్టీకి చెందిన అన్నే హిడాల్గో.. 2014 నుంచి ప్యారిస్ మేయర్‌గా ఉన్నారు. ప్యారిస్ తొలి మేయర్‌గా కూడా రికార్డు నెలకొల్పారు.
ఫ్రాన్సిస్కో ఫ్రాంకో నియంతృత్వం కారణంగా పారిపోయిన స్పానిష్ వలసదారుల కుటుంబానికి చెందిన 62 ఏండ్ల అన్నే హిడాల్గో సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్ష పదవిని గెలవడానికి హాట్ ఫేవరెట్‌గా ఉన్నారు. అయితే, అందుకు అనుగుణంగా తన ప్రొఫైల్‌ను జాతీయ స్థాయిలో విస్తరించుకోవాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్యారిస్ నగరం నుంచి కార్లను బయటకు పంపి నగరాన్ని పచ్చగా మార్చాలన్న నినాదంతో ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో పేరు తెచ్చుకున్నారు. ఫ్రాన్స్‌లో ఉండే చిన్నారులు అందరికీ ఒకే రకమైన అవకాశాలు లభించాలని కోరుకుంటున్నానని అన్నే హిడాల్గో చెప్పారు. ఫ్రాన్స్‌ను తక్కువ కార్బన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడం తన ప్రధాన ప్రాధాన్యతల్లో ఒకటని ఆమె పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి..
విప్రోలో ముగిసిన వర్క్ ఫ్రం హోం
పైలట్ తప్పిదం వల్లనే విమానం ప్రమాదం
పునరుత్పాదక విద్యుత్ వినియోగంపై దృష్టిపెట్టండి : వెంకయ్యనాయుడు
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో లెబనాన్
గణనాథుల కలెక్షన్స్‌తో గిన్నిస్ బుక్కులోకి డెంటిస్ట్
1500 మందితో పాట షూటింగ్.. ఒక్కరికీ కరోనా రాలేదు! ఎందుకంటే?
14 వేల మంది పఠాన్లును నిలువరించిన 21 మంది సిక్కు జవాన్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

