Sikh soldiers : 14 వేల మంది పఠాన్లును నిలువరించిన 21 మంది సిక్కు జవాన్లు
Sikh soldiers : పాకిస్తాన్ ప్రాంతంలోకి బ్రిటీష్ వారి చొరబాటును స్థానిక పఠాన్లకు నచ్చలేదు. దాంతో వారిని తరిమికొట్టేందుకు బ్రిటీష్ వారుండే కోటలపైకి దాడి చేయగా.. కేవలం 21 మంది సిక్కు జవాన్లు.. వేల మంది పఠాన్లను ....

పాకిస్తాన్ ప్రాంతంలోకి బ్రిటీష్ వారి చొరబాటును స్థానిక పఠాన్లకు నచ్చలేదు. దాంతో వారిని తరిమికొట్టేందుకు బ్రిటీష్ వారుండే కోటలపైకి దాడి చేయగా.. కేవలం 21 మంది సిక్కు జవాన్లు.. వేల మంది పఠాన్లను తరిమికొట్టారు. ఈ సంఘటన 1897 లో సరిగ్గా ఇదే రోజున జరిగింది. బ్రిటీష్ సైనికులుగా ఉన్న సిక్కు జవాన్ల (Sikh soldiers) వీరోచిత పోరాటాన్ని బ్రిటన్ పార్లమెంట్ ప్రశంసించింది. ‘భారత్‌తోపాటు మొత్తం బ్రిటన్ అంతా మిమ్మల్ని చూసి గర్విస్తున్నది’ అని బ్రిటన్ పార్లమెంటేరియన్లు కొనియాడారు.
ప్రస్తుతం పాకిస్తాన్‌లోని నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్‌లోని తిరా ప్రాంతంలోని గులిస్తాన్, లాక్హార్ట్లో బ్రిటీషర్లకు రెండు కోటలు ఉండేవి. ఈ కోటల మధ్య సారాగర్హి అవుట్‌పోస్ట్ ఉండేది. ఇక్కడి ప్రాంతంలోకి బ్రిటీషర్లు చొరబాటును వ్యతిరేకించిన స్థానక పఠాన్లు వారిపై దాడికి ప్రణాళిక వేశారు. దాదాపు 14 వేల మందిని సమీకరించి బ్రిటీష్ కోటలపైకి దాడికి పూనుకున్నారు. లెఫ్టినెంట్ కల్నల్ జాన్ హౌటన్ నేతృత్వంలో 36 సిక్ రెజిమెంట్‌లోని ఐదు కంపెనీలను ఏర్పాటుచేశారు. సారాగర్హి అవుట్‌పోస్ట్‌లో హవల్దార్ ఇషార్ సింగ్ ఆధ్వర్యంలో 20 మంది సిక్కు సైనికులు పహారా కాస్తున్నారు. ఇదే సమయంలో అవుట్‌పోస్ట్‌పై పఠాన్లు దాడి చేయడానికి ప్రయత్నించగా.. ‘బోలో సో నిహాల్.. సత్‌శ్రీ అకాల్’ అంటూ ఒంటరిగా పోరాటం మొదలుపెట్టారు. రెండు సార్లు వారిని తరిమికొట్టి కోటలోకి రాకుండా అడ్డుకున్నారు. సిక్కు జవాన్ల వద్ద తుపాకీ మందుగుండు నిల్వలు లేకపోవడంతో వెనక్కి తగ్గారు. ఇదే అదనుగా పఠాన్లు వారిపై దాడి చేసి కోటను స్వాధీనం చేసుకున్నారు. ఈ పోరాటంలో దాదాపు 600 మంది పఠాన్లను సిక్కు జవాన్లు చంపివేశారు. ఇదే పోరాటం ఇతివృత్తంగా ఇటీవల ‘కేసరి’ అనే సినిమాను బాలీవుడ్లో రూపొందించారు.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2007: నాన్ న్యూక్లియర్ వాక్యూమ్ బాంబును పరీక్షించిన రష్యా
2006: సిరియా రాజధాని డమాస్కస్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై దాడి
2004: అణు కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్న ఉత్తర కొరియా
2002: నేపాల్‌లో కాల్పుల విరమణను ప్రతిపాదించిన మావోయిస్టులు
2001: తీవ్రవాదంపై యుద్ధం ప్రకటించిన అమెరికా
2000: న్యూయార్క్‌లో ప్రారంభమైన అంతర్జాతీయ ఆయుర్వేద సమ్మేళనం
1998: కౌలాలంపూర్‌లో ప్రారంభమైన16 వ కామన్వెల్త్ క్రీడలు
1997: 435 మిలియన్ మైళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత అంగారక కక్ష్యకు చేరుకున్న ‘మార్స్ గ్లోబల్ సర్వేయర్’ వాహనం
1991: స్పేస్ షటిల్ ఎస్టీఎస్ 48 (డిస్కవరీ 14) ప్రయోగం
1966: డార్డనెల్లెస్ స్ట్రెయిట్ మీదుగా ఈది రికార్డు సృష్టించిన భారతీయ స్విమ్మర్ మిహిర్ సేన్
1959 : చంద్రుడిపైకి విజయవంతంగా చేరిన సోవియట్ యూనియన్‌కు చెందిన ల్యూనా-2 అంతరిక్ష నౌక
1944 : తొలిసారి జర్మనీలోకి ప్రవేవించిన అమెరికా సేనలు
1921 : ప్రముఖ రచయిత, జర్నలిస్టు సుభ్రహ్మణ్య భారతి మరణం
1919 : జర్మనీ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నట్లు ప్రకటించిన అడోల్ఫ్ హిట్లర్
ఇవి కూడా చదవండి..
కేంద్ర మంత్రి భార్య, కుమారుడిపై లుకౌట్ నోటీస్
మెక్‌డోనాల్డ్స్‌లో త్వరలో కడక్ చాయ్, పసుపు పాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

