Pakistan : ఇండియా సైనిక కార్యకలాపాలను ప్రారంభించిందంటే చాలు పాకిస్తాన్లో వణుకు ప్రారంభమవుతుంది. తాజా పరిణామాలే ఇందుకు ఉదాహరణ. భారత నావికాదళం త్వరలో సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు నోటం (నోటీస్ టు ఎయిర్ మిషన్స్) జారీ చేసింది. నావికాదళానికి సంబంధించిన సైనిక విన్యాసాలకు సంబంధించిన ఏర్పాట్ల కోసం ఈ నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఇండియా-పాకిస్తాన్ సరిహద్దులో, రాజస్థాన్‌లో 17 రోజులపాటు నోటం జరగనుంది.
సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 7 వరకు ఈ సైనిక విన్యాసాలు కొనసాగుతాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను వాయుసేన విడుదల చేసింది. అయితే, మన ఎయిర్‌ఫోర్స్ సైనిక విన్యాసాలు చేసేందుకు సిద్ధమవుతుంటే పాకిస్తాన్ వణికిపోతోంది. పాకిస్తాన్ రక్షణ శాఖ అధికారులు ఆకస్మికంగా ఒక ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఇండియా చేపట్టనున్న సైనిక విన్యాసాలపై సమీక్ష నిర్వహించారు. ఇస్లామాబాద్‌లో ఉన్న భద్రతా దళాలా చీఫ్ ఆధ్వర్యంలో ఈ సమీక్ష జరిగింది. ఇండియా-పాక్ సరిహద్దులో ఈ సైనిక విన్యాసాల వల్ల కలిగే పరిణామాలపై చర్చించారు.
ఇదే సమయంలో భారత సరిహద్దులో నిఘా పెంచాలని అక్కడి సైనిక అధికారులు ఆదేశించారు. మన సైనిక విన్యాసాల్ని పాక్ సైన్యం నిరంతరం పర్యవేక్షించనుంది. భారత వైమానిక దళానికి సంబంధించి చేపట్టే మార్పులు, సంసిద్ధత, నిషేధాలు వంటి అంశాలపై విమాన ఆపరేటర్లు, సంబంధికులకు అందే రక్షణ నోటిఫికేషన్ నోటం. సైనిక డ్రిల్స్ నిర్వహిస్తున్నప్పుడు మామూలుగానే నోటం జారీ చేస్తుంటారు. ఎయిర్‌స్పేస్‌లో నిషేధాజ్ఞలు, భద్రత వంటివి దీని పరిధిలోకి వస్తాయి. 17 రోజులపాటు భారీ సైనిక విన్యాసాలు జరగనున్నాయి.