ఇంటర్నెట్లో జంతువుల వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటాయి. వాటి చేష్టలు భలే నవ్వు తెప్పిస్తుంటాయి. ఓ పాండా వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆదమరిచి పడుకున్న ఓ పాండాను జూకీపర్ క్యారెట్‌తో గుచ్చగానే అది ఇచ్చిన రియాక్షన్ నెటిజన్లను కట్టిపడేసింది.
ఈ వీడియోలో పాండా చెక్కలపై ఆదమరిచి పడుకుని ఉంది. ఓ మహిళా జూకీపర్ స్నాక్స్ తీసుకొని వచ్చింది. క్యారెట్స్‌తో పాండాను గుచ్చగానే అది మెళ్లగా కళ్లుతెరిచి పక్కకు తిరిగింది. జూకీపర్ చేతిలోంచి క్యారెట్స్‌ను తీసుకొని తినడం మొదలెట్టింది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఎంజాయ్ చేశారు. ఫన్నీ కామెంట్లు చేశారు. ఇప్పటివరకూ ఈ వీడియోకు 8.5లక్షల వ్యూస్ రావడం విశేషం.
Wake up! Snack time! 😅 pic.twitter.com/FEKXhXgdpZ
— Buitengebieden (@buitengebieden) May 18, 2022