Odisha Coast | ఒడిశా తీరంలో మునిగిపోయిన కార్గో షిప్.. 22 మంది సిబ్బంది గల్లంతు
Odisha Coast : ఒడిశా తీరంలో పనామాకు చెందిన కార్గో నౌక మునిగిపోయింది. ఈ ఘటనలో నౌకలోని 22 మంది సిబ్బంది గల్లంతయ్యారు. పనామాకు చెందిన కార్గో నౌక సింగపూర్ వెళ్తుండగా, ఒడిశా తీరంలో, బంగాళాఖాతంలో ప్రమాదవశాత్తు మునిగిపోయింది.
Odisha Coast : ఒడిశా తీరంలో పనామాకు చెందిన కార్గో నౌక మునిగిపోయింది. ఈ ఘటనలో నౌకలోని 22 మంది సిబ్బంది గల్లంతయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివి. పనామాకు చెందిన కార్గో నౌక సింగపూర్ వెళ్తుండగా, ఒడిశా తీరంలో, బంగాళాఖాతంలో ప్రమాదవశాత్తు మునిగిపోయింది.
ఒడిశా తీరంలోని పారదీప్‌నకు 240 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో నౌకలోని 22 మంది గల్లంతయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న ఇండియన్ నేవీ, కోస్ట్‌గార్డ్ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. నౌకకు చెందిన ఇద్దరిని రక్షించారు. గల్లంతైన 22 మంది కోసం గాలిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇండియన్ కోస్ట్ గార్డ్ స్పందించింది. పనామాకు చెందిన ఎంవీ ఓషన్ విన్నర్ అనే నౌకతో సంబంధాలు తెగిపోయినట్లు సమాచారం అందిందన్నారు. నౌకలో 20 మంది చైనా వాసులు, ముగ్గురు మయన్మార్ పౌరులు, ఒక బంగ్లాదేశ్ పౌరుడు ఉన్నారు.
ఒడిశా నుంచి ఈ నౌక ఐరన్ ఓర్ లోడ్‌తో శుక్రవారం సింగపూర్ బయల్దేరింది. నౌక మునిగిపోవడానికి కొద్దిసేపు ముందు సంబంధాలు తెగిపోయాయి. ప్రస్తుతం ఇండియన్ నేవీ, కోస్ట్‌గార్డ్ సంయుక్తంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో ఇదే మార్గంలో ప్రయాణిస్తున్న ఇతర నౌకల్ని అలర్ట్ చేశారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

