కాబుల్: అఫ్గానిస్థాన్‌లోని కాబుల్‌లో గల తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) శిబిరాలను లక్ష్యంగా చేసుకొని గురువారం రాత్రి పాకిస్థాన్ గగనతల దాడులకు పాల్పడటం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు తెర లేపింది. తాలిబన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తఖి భారత్‌లో తొలిసారి పర్యటిస్తున్న వేళ ఈ దాడులు జరగడం గమనార్హం. పాకిస్థాన్ తాలిబన్ లేదా టీటీపీగా పేర్కొనే సంస్థకు అఫ్గానిస్థాన్ ఆయుధాలు, నిధులు అందిస్తోందని పాక్ చాలా కాలంగా ఆరోపిస్తున్నది. టీటీపీ అధిపతి నూర్ వలీ మెహ్సుద్ అంతమే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి.
సరిహద్దుల్లోని ఒక పట్టణంతో పాటు, కాబుల్‌పై పాక్ దాడి చేయడాన్ని తాలిబన్ ప్రభుత్వం ఖండించింది. మేం చర్చలు, దౌత్యానికి తలుపులు తెరచి ఉంచాం’ అని తెలిపారు. అఫ్గానీయులతో ఆటలు ఆడొద్దని తాలిబన్ మంత్రి ముత్తఖీ.. పాక్‌ను హెచ్చరించారు.