ఇస్లామాబాద్: ఫతహ్-4 క్రూయిజ్ మిస్సైల్(Fatah-4 Cruise Missile)ను ఇవాళ పాకిస్థాన్ విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని డెవలప్ చేశారు. లాంగ్ రేంజ్ టార్గెట్లను ఇది పేల్చగలదని పాక్ ఆర్మీ చెప్పింది. రాకెట్ ఫోర్స్ కమాండ్ ఈ క్షిపణిని పరీక్షించినట్లు ఐఎస్పీఆర్ ఓ ప్రకటనలో తెలిపింది. అడ్వాన్స్డ్ ఏవియానిక్స్, నేవిగేషన్ తో దీన్ని రూపొందించారు. సైనిక బలగాల సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ క్షిపణిని పరీక్షించినట్లు ఆర్మీ చెప్పింది. దేశాధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారి, ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ .. ఆ క్షిపణి పరీక్ష పట్ల ప్రశంసలు కురిపించారు. గత నెలలో పాక్ ఆర్మీకి చెందిన రాకెట్ ఫోర్స్ కమాండ్.. ఫతహ్-2 మిస్సైల్ సిస్టమ్‌ను పరీక్షించిన విషయం తెలిసిందే. 2025 సెప్టెంబర్‌లో క్రూయిజ్ మిస్సైల్ ఫతహ్-4 ట్రైనింగ్ లాంచ్ చేసింది. ఫతహ్-4 సుమారు 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను ధ్వంసం చేయగలదు. గత ఏడాది మే నెలలో కూడా ఫతహ్ సిరీస్‌కు చెందిన సర్ఫేస్ టు సర్ఫేస్ క్షిపణిని పాక్ ఆర్మీ పరీక్షించింది.