ఇస్లామాబాద్, ఆగస్టు 10: ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని సర్కార్ సిఫారసు మేరకు పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీని ఆ దేశ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ రద్దు చేశారు. ప్రస్తుత పార్లమెంట్ రద్దు అయ్యిందని బుధవారం అర్ధరాత్రి అధ్యక్ష కార్యాలయం నుంచి ఒక నోటిఫికేషన్ విడుదలైంది.
ప్రధాని నేతృత్వంలోని క్యాబినెట్ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు.