న్యూఢిల్లీ, మే 9 : పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఓ పిరికిపంద అని పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్(పీటీఐ) ఎంపీ షాహిద్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఎం మో దీ పేరును సైతం మా ప్రధాని ఉచ్ఛరించడం లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. పాకిస్తాన్ భారత్‌పై డ్రోన్ల దాడికి తెగబడిన తర్వాత శుక్రవారం పాకిస్థాన్ పార్లమెంట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన ట్టు ఎన్డీటీవీ కథనం తెలిపింది. పాకిస్థాన్‌కు చెందిన ప్రజాప్రతినిధి ఆ దేశ ప్రధానిపై చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పాక్ ప్రధానిపై ఇటీవల సొంత దేశంలో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్.. పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడి అనంతరం షెహబాజ్ షరీఫ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌పై పాక్ ప్రజలు తీవ్ర స్థాయిలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.