వాషింగ్టన్: పాకిస్థాన్ తన అణ్వాయుధాలను ఆధునికీకరిస్తున్నదని అమెరికన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. దీనికి చైనా సైనిక, ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు తెలిపింది. ఆదివారం విడుదల చేసిన వరల్డ్ థ్రెట్ అసెస్మెంట్ నివేదిక ప్రకారం, పాకిస్థాన్ సైన్యం రానున్న సంవత్సరంలో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం గల అంశాల్లో అణ్వాయుధాల ఆధునికీకరణతోపాటు పొరుగు దేశాలతో సరిహద్దులను దాటి ఘర్షణలకు పాల్పడటం కూడా ఉంది.
భారీ విధ్వంసకర ఆయుధాలను అభివృద్ధి చేసేందుకు అవసరమైన పదార్థాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా నుంచి పాకిస్థాన్ సమకూర్చుకుంటున్నది. చైనా నుంచి హాంకాంగ్, సింగపూర్, తుర్కియే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గుండా వీటిని రప్పిస్తున్నది.