Imran Khan | జైలులో తనకు మరోసారి స్లో పాయిజన్ ఇచ్చి చంపేందుకు కుట్రలు జరిగే అవకాశం ఉందని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ప్రస్తుతం ఇమ్రాన్ సైఫర్ కేసులో రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. ప్రస్తుతం తాను శారీరకంగా దృఢంగా ఉన్నానన్నారు. తనపై ఇ్పటికే రెండుసార్లు బహిరంగంగా చంపేందుకు ప్రయత్నించారన్నారు. రహస్య ప్రత్రాల (సైఫర్) లీక్ కేసులో బెయిల్‌ను కోరడంతో పాటు మొదటి ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ పాక్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆయా పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.
ఈ నేపథ్యంలో పీటీఐ చీఫ్ వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి. వాషింగ్టన్‌లోని పాక్ రాయబార కార్యాలయం పంపిన దౌత్య ప్రతాలను లీక్ చేసినందుకు గతేడాది మార్చిలో ఇమ్రాన్‌పై కేసు నమోదైంది. ఆగస్టులో ఆయనను అరెస్టు చేశారు. ఇమ్రాన్‌తో పాటు ఆయన సన్నిహితుడు, మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీని పాకిస్థాన్‌లోని ప్రత్యేక కోర్టు గతంలో దోషిగా నిర్ధారించింది. తనపై ఉన్న కేసులన్నీ పూర్తిగా నకిలీవని, రాజకీయ ప్రేరేపితమైనవని ఆరోపించారు. ఎన్నికలు ముగిసే వరకు.. లేదంటే ఎక్కువ కాలం జైలులో ఉంచేందుకు మాత్రమే ఉద్దేశించిన కేసులన్నారు.
గత కొద్దిరోజులుగా దేశంలో చట్టం పూర్తిగా జోక్‌గా మారిందన్నారు. ఈ సందర్భంగా పాక్ ముస్లిం లీగ్ నవాజ్ నేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై వచ్చిన ఆరోపణలను ఇమ్రాన్ గుర్తు చేశారు. ఈ రోజులు జరుగుతున్నవి లండన్ ప్రణాళిక అమలు మాత్రమేనన్నారు. లండన్ ఒప్పందం ఓ పిరికివాడు, అవనీతిపరుడైన నేరస్థుడు, అతని సహాయకుల మధ్య జరిగిందన్నారు. దోషిగా తేలిన నేరస్థుడు (నవాజ్ షరీఫ్) క్లీన్ చిట్‌తో తిరిగి రాజకీయాల్లోకి రావడానికి ఏకైక మార్గం దేశంలోని సంస్థలను నాశనం చేయడమేనని.. మనం చూస్తున్నది న్యాయ వ్యవస్థ పూర్తిగా పతనమైపోవడమేనని ఇమ్రాన్ విమర్శించారు.