ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐతో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ఆ పార్టీ అధికారంలో ఉన్న చివరి ప్రావిన్స్ ఖైబర్ పఖ్తుంఖ్వాలో అత్యవసర పరిస్థితిని విధించింది. రాజ్యాంగబద్ధ పాలన వైఫల్యం, ఉగ్రవాదం తీవ్రమవడాన్ని కారణాలుగా చూపుతూ దేశాధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఎమర్జెన్సీని ఆమోదించారు. ఈ నిర్ణయం పాక్ ప్రభుత్వం, ఇమ్రాన్ పార్టీల మధ్య మరో ఘర్షణకు దారి తీసింది. నిరసనకారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని..
- పీటీఐ అధికారంలో ఉన్న చివరి ప్రావిన్స్‌లో విధింపు
ఇస్లామాబాద్: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐతో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ఆ పార్టీ అధికారంలో ఉన్న చివరి ప్రావిన్స్ ఖైబర్ పఖ్తుంఖ్వాలో అత్యవసర పరిస్థితిని విధించింది. రాజ్యాంగబద్ధ పాలన వైఫల్యం, ఉగ్రవాదం తీవ్రమవడాన్ని కారణాలుగా చూపుతూ దేశాధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఎమర్జెన్సీని ఆమోదించారు. ఈ నిర్ణయం పాక్ ప్రభుత్వం, ఇమ్రాన్ పార్టీల మధ్య మరో ఘర్షణకు దారి తీసింది.
నిరసనకారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని..అలాంటి వారిని ఉక్కు పాదంతో అణచివేస్తామని ప్రొవిన్సియల్ గవర్నర్ హెచ్చరించారు. ఆదివారం ఎమర్జెన్సీ విధించిన వెంటనే ముఖ్యమంత్రి సొహైల్ అఫ్రిది, ప్రొవిన్సియల్ పార్టీ అధ్యక్షుడు జునైద్ అక్బర్‌ను అరెస్ట్ చేశారని పీటీఐ నాయకులు ఆరోపించారు. తమ అధినేత ఇమ్రాన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సొహైల్ అఫ్రిది నేతృత్వంలో ఇస్లామాబాద్‌కు కవాతు చేయాలని పీటీఐ నిర్ణయించిన వేళ ఎమర్జెన్సీని విధించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

