Pakistan | సంక్షోభంలో పాక్..! అంతర్జాతీయ ద్రవ్య నిధి కీలక సిఫారసులు..!
Pakistan | సంక్షోభంలో అల్లాడుతున్న పాకిస్థాన్‌కు అదనపు ఆదాయాన్ని సమకూర్చేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) పలు సూచనలు చేసింది. పన్నులు పెంచడంతో పాటు, పన్ను స్లాబ్‌లను తగ్గించడం, మినహాయింపునకు స్వస్తి పలకడం తదితర చర్యలు చేపట్టాలని సిఫారసు చేసింది.
Pakistan | సంక్షోభంలో అల్లాడుతున్న పాకిస్థాన్‌కు అదనపు ఆదాయాన్ని సమకూర్చేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) పలు సూచనలు చేసింది. పన్నులు పెంచడంతో పాటు, పన్ను స్లాబ్‌లను తగ్గించడం, మినహాయింపునకు స్వస్తి పలకడం తదితర చర్యలు చేపట్టాలని సిఫారసు చేసింది. ఐఎంఎఫ్ సూచనలను పాటిస్తే పాక్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అవకాశం ఉన్నది. అంతర్జాతీయ ద్రవ్య నిధి వ్యక్తిగత ఆదాయపు పన్నుపై సిఫార్సులను పూర్తిగా అమలు అమలు చేస్తే జీడీపీలో 0.5శాతం అదనంగా వసూలయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉత్పత్తి ఆదాయం వార్షిక ప్రాతిపదికన 500 బిలియన్ల పాక్ రూపీకి సమానం.
ఐఎంఎఫ్ సిఫార్సులను ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (FBR) అంగీకరిస్తే.. మధ్య తరగతి జీవులపై పన్నుభారం రెట్టింపయ్యే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో (జూలై-ఫిబ్రవరి) ఎఫ్బీఆర్ ఇప్పటివరకు వేతన జీవుల నుంచి రూ.215 బిలియన్లు సేకరించింది. నిర్ధిష్ట రంగాల్లోని ఉద్యోగులకు ప్రాధాన్యతను తొలగించేందుకు ఆదాయపు పన్ను ఆర్డినెన్స్ (ఐటీఓ), షేర్లలో పెట్టుబడులకు పన్ను క్రెడిట్, తనఖా చెల్లింపులకు మినహాయింపు, పూర్తికాలానికి పన్ను మినహాయింపు రెండో షెడ్యూల్, చాప్టర్-3లను సమీక్షించాలని కోరారు. గతంలో ఐఎంఎఫ్ సమీక్షా బృందం ఫిబ్రవరి మొదటివారంలో నగదు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ లో పర్యటించాల్సి ఉండగా.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రతినిధి బృందం సందర్శించడానికి నిరాకరించడం గమనార్హం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

