ఇస్లామాబాద్, అక్టోబర్ 23: ప్రేమగా దగ్గరకు తీసుకొని నిమరడం, కౌగిలించుకోవడం, పడక గదిలోని సన్నివేశాలు, సైగలతోనే సరసాలు తదితర ప్రసారాలపై నిషేధం విధించాలని స్థానిక టీవీ చానళ్లకు పాకిస్థాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి సీన్లు వీక్షకుల మనసులను చెడగొట్టడంతో పాటు దేశ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధమని అభిప్రాయపడింది. ఈ మేరకు పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పెమ్రా) టీవీ చానళ్లకు ఉత్తర్వులు జారీ చేసింది.