Pakistan Missiles: అత్యాధునిక బాలిస్టిక్ క్షిపణి టెక్నాలజీ అభివృద్ధి చేస్తున్న పాకిస్థాన్.. అమెరికా ఆందోళన
Pakistan Missiles: పాకిస్థాన్ తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా. అత్యాధునిక క్షిపణి టెక్నాలజీని పాకిస్థాన్ డెవలప్ చేస్తున్నట్లు వైట్‌హౌజ్ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. సుదీర్ఘ దూరం ప్రయాణించే బాలిస్టిక్ క్షిపణులను కూడా పాక్ అభివృద్ధి చేస్తున్నట్లు ఆరోపించారు.
వాషింగ్టన్: పాకిస్థాన్(Pakistan Missiles) తీరుపై అమెరికా శ్వేతసౌధం ఆందోళన వ్యక్తం చేసింది. అత్యాధునిక క్షిపణి టెక్నాలజీని పాకిస్థాన్ డెవలప్ చేస్తున్నట్లు వైట్‌హౌజ్ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. సుదీర్ఘ దూరం ప్రయాణించే బాలిస్టిక్ క్షిపణులను కూడా పాక్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ టెక్నాలజీతో తమకు కూడా ప్రమాదకరంగా మారనున్నట్లు అమెరికా చెప్పింది. పాకిస్థాన్‌కు చెందిన నాలుగు కంపెనీలపై ఇటీవల అమెరికా ఆంక్షలు విధించింది. దాంట్లో ఆ సర్కారు చెందిన నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ కూడా ఉన్నది.
అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ ఫినర్.. పాకిస్థాన్ ప్రోగ్రామ్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. పాక్ చేపడుతున్న లాంగ్ రేంజ్ మిస్సైల్ ప్రోగ్రామ్‌పై వత్తిడి తెస్తున్నామని, ఆ సమస్యను తీర్చేందుకు దౌత్య విధానాన్ని కూడా అవలంభిస్తున్నట్లు ఫినర్ తెలిపారు. పాక్‌లోని ఎన్డీసీతో పాటు అక్తర్ అండ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అఫిలియేట్స్ ఇంటర్నేషనల్, రాక్‌సైడ్ ఎంటర్ప్రైజ్ సంస్థలపై కూడా ఆంక్షలు విధించారు. ఈ సంస్థలు పాక్ బాలిస్టిక్ ప్రోగ్రామ్‌కు సహకరిస్తున్నట్లు తేలిందని అమెరికా చెప్పింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
MLA Sudheer Reddy | సాగు, తాగు నీరందకుండా చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

