ఇస్లామాబాద్: షాహీన్-3 బాలిస్టిక్ మిస్సైల్‌ను ఇవాళ పాకిస్థాన్ విజయవంతంగా పరీక్షించింది. షాహీన్ వెపన్ వ్యవస్థలో ఉన్న అనేక అంశాలను పరీక్షించేందుకు ఈ టెస్ట్ చేపట్టినట్లు మిలిటరీ పేర్కొన్నది. డిజైన్, టెక్నికల్ పారామీటర్లను పరీక్షించినట్లు ఐఎస్పీఆర్ తన ట్విట్టర్ అకౌంట్లో చెప్పింది. గత ఏడాది జనవరిలోనూ పాకిస్థాన్ షాహీన్ మిస్సైల్‌ను పరీక్షించిన విషయం తెలిసిందే. షాహీన్-3 సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైల్. దీని రేంజ్ 2750 కిలోమీటర్లు. అంటే ఈ క్షిపణి ఇండియాలోని అన్ని ప్రాంతాలను చేరుకోగలదు. అండమాన్, నికోబార్ దీవుల్ని కూడా ఈ క్షిపణి చేరుకుంటుందని భావిస్తున్నారు. ఈ క్షిపణిలో ఘన ఇంధాన్ని వాడుతున్నారు. యాంటీ బాలిస్టిక్ మిస్సైల్ వ్యవస్థను కూడా ఇది తప్పించుకోగలదు. 2015లో తొలిసారి పాకిస్థాన్ షాహీన్ మిస్సైల్‌ను పరీక్షించింది.