ఇస్లామాబాద్: పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ సభ్యుడు అమీర్ లియాఖత్ ముచ్చటగా మూడో పెండ్లి చేసుకున్నారు. సుమారు 50 ఏండ్ల వయసున్న ఆయన 18 ఏండ్ల యువతిని బుధవారం వివాహమాడారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో గురువారం వెల్లడించారు. ‘గత రాత్రి 18 ఏండ్ల సయేదా దానియా షాను పెండ్లి చేసుకున్నా. ఆమె దక్షిణ పంజాబ్ లోధ్రాన్లోని గౌరవనీయమైన నజీబ్ ఉత్ టార్ఫైన్ ‘సాదాత్’ కుటుంబానికి చెందిన యువతి. చాలా అందంగా, మనోహరంగా, సరళంగా, ప్రియంగా ఉంటుంది. మా జంటను ఆశీర్వదించండి. దయ చేసి మా కోసం ప్రార్థించండి. నేను ఇప్పుడే చీకటి గుహ నుంచి బయటపడ్డాను. నా గత జీవితం రాంగ్ టర్న్’ అని అందులో పేర్కొన్నారు.
కాగా, రెండో భార్య, పాక్ నటీ తుబా అమీర్ నుంచి విడాకులు పొందిన బుధవారం రోజునే, 18 ఏండ్ల యువతిని అమీర్ లియాఖత్ పెండ్లి చేసుకున్నారు. అయితే పెండ్లికి ముందుగానే కొత్త భార్య గురించి సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేశారు. అలాగే పెండ్లి తర్వాత మూడో భార్యతో కలిసి ఒక టీవీకి ఆయన ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు.
#AamirLiaquat new interview after marriage with #SyedaDaniaShah at #NadirAli podcast 🥲🤣#amirliaquat pic.twitter.com/vk9HvE6zUH
— Malik Shoujaat 🇵🇰 (@Malok_Shoujaat) February 11, 2022
మరోవైపు చిన్నప్పుడే అమీర్ లియాఖత్‌తో ప్రేమలో పడినట్లు కొత్త భార్య దానియా తెలిపింది. ఆయనను టీవీలో చూసి ఇష్టపడ్డానని, తన ఆట బొమ్మని చెప్పింది. తాను ఎప్పుడు ఏడ్చినా, తన తల్లిదండ్రులు అమీర్ లియాఖత్‌ను టీవీలో చూపేవారని పేర్కొంది. టీవీలో చూసిన వ్యక్తిని పెండ్లి చేసుకుంటానని మీరు ఎప్పుడైనా అనుకున్నారా అని యాంకర్ అడిగారు. అయితే తమ పెండ్లిని తాను ఇంకా నమ్మలేకపోతున్నానని ఆమె అన్నది.
కాగా, అమీర్ లియాఖత్ మూడో పెండ్లిపై పాక్‌కు చెందిన నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ ఆడుకున్నారు. వారిద్దరి మధ్య 31 ఏండ్ల వయసు తేడా ఉండటంతో పలు మీమ్స్‌తో సందడి చేశారు. అమీర్ లియాఖత్ 18 ఏండ్ల కిందటే తన భార్యను ఎత్తుకున్నారంటూ ఒకరు ట్వీట్ చేశారు.
#amirliaquat holding his wife just 18 years back.#SyedaDaniaShah #dania pic.twitter.com/koInhfUvfd
— FEBRUARY 🌏 (@TitturHoja) February 10, 2022