కాబూల్: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) మరోసారి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన తర్వాత దేశం నుంచి బయటపడటానికి వేలాది మంది ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. రెండు వారాలుగా ఇలా కాబూల్ ఎయిర్పోర్ట్ దగ్గర వేల మంది జనం పడిగాపులు కాస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ 5 లక్షల మందికిపైగా ఆఫ్ఘన్‌ను వీడారని, అందులో మెజార్టీ మహిళలు, పిల్లలే ఉన్నారని యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ వెల్లడించింది. దేశంలో పెరిగిపోతున్న హింస, అభద్రతాభావం కారణంగా ఆఫ్ఘనిస్థాన్ పొరుగు దేశాలు తమ సరిహద్దులను తెరిచే ఉంచాలని యూఎన్‌హెచ్‌సీఆర్ కోరింది. ఇలా చేయడం వల్ల వేలాది మంది పౌరుల ప్రాణాలు కాపాడిన వాళ్లు అవుతారని అభిప్రాయపడింది. మరోవైపు యురోపియన్ దేశాల్లోని స్థానిక ఆఫ్ఘన్లు.. తాలిబన్లకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు.
More than half a million Afghans – a majority of whom are women & children – have been forced to flee due to increasing violence & insecurity.
— UNHCR, the UN Refugee Agency (@Refugees) August 29, 2021
UNHCR calls on Afghanistan's neighbours to keep their borders open. Being able to seek safety can save the lives of countless civilians. pic.twitter.com/KMzjK1RODB