అమెరికాలోని మిషిగన్‌లో మంచు తుఫాను కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం గ్రాండ్ ర్యాపిడ్స్ నైరుతి దిశలో అంతర్ రాష్ట్ర రహదారిపై 100కు పైగా వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి. దీంతో కొన్ని వాహనాలు రోడ్డు మీద నుంచి పక్కకు జారిపోయాయి. ప్రమాదం కారణంగా పోలీసులు రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్‌ను నిలిపేశారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. మంచు తుఫాను కారణంగా తమ ముందున్న వాహనాలు కనిపించ లేదని పలువురు బాధిత వాహనదారులు తెలిపారు. అమెరికాలోని పలు రాష్ర్టాలు ప్రస్తుతం మంచు తుఫానుల సమస్యను ఎదుర్కొంటున్నాయి.