సోమవారం 19 అక్టోబర్ 2020
International - Oct 02, 2020 , 02:02:38

‘హాథ్రస్‌'పై ఆగ్రహావేశాలు

‘హాథ్రస్‌'పై ఆగ్రహావేశాలు

  • పరామర్శకు వెళ్తున్న రాహుల్‌,  ప్రియాంక అరెస్ట్‌.. విడుదల

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో దళిత యువతిపై హత్యాచారం, అర్ధరాత్రి హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. యూపీలో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలను బుధవారం మధ్యాహ్నం గ్రేటర్‌ నోయిడావద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కాసేపటి తర్వాత విడుదల చేశారు. అంతకుముందు, పోలీసులకు, రాహుల్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో రాహుల్‌ కిందపడిపోయారు. పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశంలో ఆరెస్సెస్‌ నేతలు, ప్రధాని మోదీ మాత్రమే రోడ్డుపై నడువాలా అని ప్రశ్నించారు. పోలీసులు తనపై లాఠీచార్జి చేశారని ఆరోపించారు. కాగా రాహుల్‌, ప్రియాంకపై పోలీసులు కేసు నమోదు చేశారు.


logo