వాషింగ్టన్: బడా కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో లేఆఫ్‌లపై ఆన్లైన్ పిటిషన్ నమోదైంది. హెచ్-1బీ వీసా హోల్డర్లకు గ్రేస్ పీరియడ్‌ను రెండు నెలల నుంచి ఏడాదికి పెంచాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కోరుతూ రెండు ఇండో అమెరికన్ సంస్థలు ఈ పిటిషన్‌ను దాఖలు చేశాయి.
ఉద్యోగుల ఆకస్మిక తొలగింపులతో ఎంతో మంది భారతీయులు ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఇంకో ఉద్యోగం వెతుక్కొనే అవకాశం కల్పించాలని కోరాయి.