అబుదాబి: మీరు చదివింది నిజమే! ఈ హోటల్లో ఒక్క రాత్రి బసకు రూ.82,53,955 చెల్లించాల్సిందే. ఈ రిసార్ట్‌లోకి అడుగుపెట్టగానే గాజు గోడల మధ్య జాలువారే నీళ్లు, ఎగిసిపడుతున్న మంటలు సరికొత్త అనుభూతిని ఇస్తాయి. బెలాజియో శైలి ఫౌంటెన్లు మన కండ్లను కట్టిపడేస్తాయి. ఇందులోని పది మంది ఈతకొట్టేలా ఫూల్లాంటి అధునాతన సౌకర్యాలున్నాయి. ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ రిసార్ట్‌గా పిలుస్తున్న ఈ ‘అట్లాంటిస్ ది రాయల్’ దుబాయ్‌లో ఉన్నది.