Olo Colour | న్యూయార్క్: అమెరికా శాస్త్రవేత్తలు సరికొత్త రంగును ఆవిష్కరించారు. ఇది కంటికి కనిపించకపోవడం గమనార్హం. ఈ రంగును శాస్త్రవేత్తలు ‘ఓలో’గా పిలుస్తున్నారు. ఇప్పటివరకు ఈ రంగును ఐదుగురు మాత్రమే చూశారు. ఆ రంగు పీకాక్ బ్లూ లేదా టీల్‌లాగా ఉందని వారు అభివర్ణించారు. ఈ మేరకు ‘సైన్స్ అడ్వాన్సెస్’ జర్నల్‌లో కథనం ప్రచురితమైంది.
బెర్క్లీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఈ కలర్‌ను అభివృద్ధి చేశారు. రెటీనాపై లేజర్ మ్యానిపులేషన్ ద్వారా శాస్త్రవేత్తలు ఈ రంగును చూశారు. రెటీనాలోకి లేజర్‌ను ప్రసరింపజేశారు. దాంతో రెటీనా సాధారణ పరిమితికి మించి చూడగలిగేలా లేజర్ ప్రేరేపించింది. తద్వారా శాస్త్రవేత్తలు ఓలో రంగును చూడగలిగారు.