ఒట్టావా: నువ్వు ఒంటరి కాదంటూ.. ఐసీయూలోని రోగులను ఉత్సాహపరుస్తూ ఒక నర్సు పాడిన పాట సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. కెనడాలోని ఒట్టావా ఆసుపత్రిలో పని చేసే ఎండోస్కోపీ నర్సు అమీ-లిన్‌ను ఇటీవల తిరిగి ఐసీయూ వార్డులో నియమించారు. ఈ నేపథ్యంలో అక్కడి రోగులను ఉత్సాహపరిచేందుకు ఆమె ప్రయత్నించారు. మాస్క్ ధరించిన ఆమె గిటార్ వాయిస్తూ.. నువ్వు ఒంటరి కాదు.. అనే పాట పాడారు. ఈ వీడియోను ఆసుపత్రి యాజమాన్యం ట్విట్టర్లో పోస్ట్ చేసింది. రోగులలో మనోదైర్యం నింపినందుకు ధన్యవాదాలు అని పేర్కొంది. స్ట్రాంగర్ టుగెదర్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేసింది.
This is Amy-Lynn. An endoscopy nurse at The Ottawa Hospital, who has recently been redeployed to the ICU.
— The Ottawa Hospital (@OttawaHospital) April 24, 2021
Here she is with a beautiful song for our patients… “You are not alone”.
Thank you for lifting our spirits, Amy-Lynn! 💙#StrongerTogether pic.twitter.com/Xn11mNr44D
మరోవైపు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఐసీయూలోని రోగులను ఉత్సాహపరిచేందుకు నర్సు అమీ చేసిన ప్రయత్నాని నెటిజన్లు కొనియాడారు. ఆమె సంగీతం, పాట బాగున్నాయని, రోగులకు ఇది ఎంతో ఊరట ఇచ్చి ఉంటుందని పేర్కొన్నారు.