US-Iran talks | అమెరికా-ఇరాన్ చర్చలకు రంగం సిద్ధం.. స్విట్జర్లాండ్ చేరుకున్న జేడీ వాన్స్.. ఒప్పందంలోని కీలక ప్రతిపాదనలివే
US-Iran talks : అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించి తుది, సాంకేతిక అంశాలపై చర్చించేందుకు ఇరు దేశాలు సిద్ధమయ్యాయి. స్విట్జర్లాండ్ (స్విస్) వేదికగా జరగనున్న ఈ చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆదివారం స్విట్జర్లాండ్ చేరుకున్నారు.
US-Iran talks : అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించి తుది, సాంకేతిక అంశాలపై చర్చించేందుకు ఇరు దేశాలు సిద్ధమయ్యాయి. స్విట్జర్లాండ్ (స్విస్) వేదికగా జరగనున్న ఈ చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆదివారం స్విట్జర్లాండ్ చేరుకున్నారు. మిగతా అమెరికా ప్రతినిధులైన స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ ఇప్పటికే స్విస్‌లో ఉన్నారు. ఇరాన్ ప్రతినిధులు కూడా స్విట్జర్లాండ్ చేరుకున్నారు.
ఈ చర్చల్లో ఇరాన్, అమెరికాతోపాటు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్, ఖతార్ కూడా పాల్గొంటున్నాయి. ఈ చర్చల్ని సాంకేతికపరమైన అంశాలుగా పేర్కొంటున్నారు. ఆదివారమే ఈ చర్చలు జరిగే అవకాశం ఉంది. నిజానికి ఈ చర్చలు గత శుక్రవారమే జరగాలి. కానీ, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ చర్చలకు నిరాకరించింది. దీంతో ఆదివారం మళ్లీ చర్చలు జరిగే ఛాన్స్ ఉంది. చర్చలు సానుకూలంగా సాగుతాయని ఆశిస్తున్నట్లు జేడీ వాన్స్ చెప్పారు. ఇరాన్ అణుకార్యక్రమంతోపాటు ప్రాంతీయ భధ్రత ప్రధానంగా ఈ చర్చలు జరుగుతాయి. ఇరాన్‌లోని అణుకేంద్రాలను ఐక్యరాజ్యసమితి కమిటీ తనిఖీ చేసేందుకు అనుమతించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. అలాగే, ఖతార్‌లో నిలిపివేసిన ఆరు బిలియన్ డాలర్ల ఇరాన్ డబ్బులను తీసుకునేందుకు అమెరికా అంగీకరించనుంది.
ఈ నిధుల్ని ఇరాన్ మానవతా అవసరాల కోసమే వాడాలని అమెరికా షరతు. అంటే, ఈ డబ్బులతో ఆహారం, మందులు వంటివి మాత్రమే ఇరాన్ కొనుగోలు చేయాలి. అలాగే, హార్ముజ్ జలసంధి నిర్వహణ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. వీటిన్నింటిపై ఈ రోజు చర్చలు జరిపి, సాంకేతికంగా ఒక ఒప్పందానికి రావాల్సి ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

