Kim Jong Un | ఉత్తర కొరియా అధినేత (North Korean leader) కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తన సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. అమెరికా (United States) – దక్షిణ కొరియా (South Korea)లపై అణుదాడికి (nuclear attack) సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ విషయాన్ని ఉత్తరకొరియా ప్రభుత్వ వార్తా సంస్థ కేసీఎన్ఏ (KCNA) సోమవారం ధ్రువీకరించింది. ఉత్తరకొరియా (North Korea) సరిహద్దుల్లో అమెరికా (United States) – దక్షిణ కొరియా (South Korea) వ్యూహాత్మక దళాలు సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు చేయడం, సైన్యాన్ని విస్తరించడాన్ని కిమ్ (Kim Jong Un) తప్పుపట్టారు. ఈ మేరకు ఇరు దేశాల నుంచి ఎదురయ్యే అణుదాడిని తిప్పికొట్టేందుకు సైన్యం సిద్ధంగా ఉండాలని కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) ఆదేశించారు.
అంతకు ముందు డమ్మీ అణువార్ హెడ్‌తో ఉత్తర కొరియా ఆదివారం ఓ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించింది. ఇది సుమారు 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 800 మీటర్ల ఎత్తులో లక్ష్యాన్ని తాకింది. ఇరు దేశాలకు బలమైన సంకేతం పంపేందుకే ఈ క్షపణిని ప్రయోగించింది. యుద్ధంలో ప్రతిదాడి చేయడానికి, అణు ప్రతిదాడి సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు ఈ కసరత్తు చేసినట్లు ఉత్తర కొరియా వార్తా సంస్థ వెల్లడించింది. ఈ ప్రయోగాలపై కిమ్ జోంగ్ ఉన్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు కేసీఎన్ఏ వెల్లడించింది.
కాగా, అమెరికా, దక్షిణ కొరియా కలిసి ఫ్రీడమ్ షీల్డ్ (Freedom Shield) పేరుతో 11 రోజుల పాటు మిలిటరీ ఎక్సర్ సైజ్ నిర్వహించాయి. ఈ విన్యాసాల్లో స్ట్రాటజిక్ బాంబర్లను వినియోగించడంతో వీటికి వ్యతిరేకంగా ఉత్తర కొరియా అణుప్రతిదాడులపై దృష్టి సారించింది. ఇటీవల ఉత్తర కొరియా ఒకే రోజున 4 క్షిపణులను పరీక్షించిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన క్షిపణి పరీక్షకు కిమ్ తన తొమ్మిదేండ్ల కుమార్తె కిమ్ జుఏతో కలిసి హాజరయ్యారు.
Also Read..
Mamata Banerjee | మోదీకి రాహుల్ గాంధీ ‘అతిపెద్ద టీఆర్పీ’ : మమతా బెనర్జీ
Salman Khan | సల్మాన్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు.. నటుడి ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
India Corona | దేశంలో మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసులు.. గత 24 గంటల్లో ఎన్ని కేసులంటే..?
Aishwaryaa Rajinikanth | ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో చోరీ.. లాకర్లోని బంగారు, వజ్రాభరణాలు మాయం