Mamata Banerjee | మోదీకి రాహుల్ గాంధీ ‘అతిపెద్ద టీఆర్పీ’ : మమతా బెనర్జీ
Mamata Banerjee | కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి (West Bengal Chief Minister), తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి (Trinamool Congress leader) మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Mamata Banerjee | కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి (West Bengal Chief Minister), తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి (Trinamool Congress leader) మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నిర్వహించిన పార్టీ అంతర్గత సమావేశంలో మమత మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి రాహుల్ గాంధీ (Rahul Gandhi) ‘అతిపెద్ద టీఆర్పీ’ (biggest TRP) అని వ్యాఖ్యానించారు. ‘రాహుల్.. మోదీకి అతిపెద్ద టీఆర్పీ. రాహుల్ గాంధీని నాయకుడిగా కొనసాగించాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటోంది. రాహుల్ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ముఖచిత్రంగా ఉంటే ప్రధాని మోదీని ఎవరూ విమర్శించలేరు’ అని మమత అన్నారు.
‘పార్లమెంట్లో అదానీ (Adani), ఎల్ఐసీ (LIC) ఇష్యూపై చర్చలు జరపాలని మేము కోరుకుంటున్నాము. అదానీ సమస్యపై (Adani issue) చర్చలు ఎందుకు జరగడం లేదు? ఎల్ఐసీ (LIC issue)పై చర్చలు ఎందుకు జరగడం లేదు? గ్యాస్ ధర (price of gas)పై చర్చ ఎందుకు జరగలేదు? వీటన్నింటి మధ్య యూనిఫాం సివిల్ కోడ్ కాపీ (Uniform Civil Code copy)ని ప్రవేశపెట్టారు. మేము యూనిఫాం సివిల్ కోడ్ను అంగీకరించము. దాన్ని అమలు చేసేందుకు మేము అనుమతించబోము’ అని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఇటీవల యూకే పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటులో దుమారం చెలరేగిన నేపథ్యంలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read..
Salman Khan | సల్మాన్ను చంపేస్తామంటూ బెదిరింపులు.. నటుడి ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
India Corona | దేశంలో మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసులు.. గత 24 గంటల్లో ఎన్ని కేసులంటే..?
Aishwaryaa Rajinikanth | ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో చోరీ.. లాకర్లోని బంగారు, వజ్రాభరణాలు మాయం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

