Salman Khan | సల్మాన్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు.. నటుడి ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
Salman Khan | బాలీవుడ్ (Bollywood) స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan)కు మరోసారి బెదిరింపులు (threat email) వచ్చిన విషయం తెలిసిందే. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (gangsters Lawrence Bishnoi) గ్యాంగ్ నుంచి సల్మాన్‌కు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు (threat email) వచ్చాయి.
Salman Khan | బాలీవుడ్ (Bollywood) స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan)కు మరోసారి బెదిరింపులు (threat email) వచ్చిన విషయం తెలిసిందే. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (gangsters Lawrence Bishnoi) గ్యాంగ్ నుంచి సల్మాన్‌కు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు (threat email) వచ్చాయి. దీనిపై ముంబయి (Mumbai) లోని బాంద్రా (Bandra) పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయనకు భద్రత పెంచారు. మరోవైపు నటుడి నివాసం వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.
సల్మాన్ ఖాన్ (Salman Khan)ను చంపేస్తామంటూ ఆయన కార్యాలయానికి శనివారం మధ్యాహ్నం ఓ బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన నటుడి టీం వెంటనే పోలీసులను ఆశ్రయించారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్ స్టర్లు లారెన్స్ బిష్ణోయ్ (gangsters Lawrence Bishnoi), గోల్డీ బ్రార్ (Goldie Brar), రోహిత్ గార్గ్ (Rohit Garg)లపై బాంద్రా పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 506(2), 120 (బీ) 34 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్‌కు ముప్పు ఉందని గుర్తించిన ముంబై పోలీసులు ఆయన నివాసం వద్ద వై ప్లస్ కేటగిరి భద్రత (Y+ category security)ను కల్పించారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి సల్మాన్‌కు బెదిరింపులు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు భద్రత కల్పించింది.
కాగా, సల్మాన్‌కు గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు రావడం ఇది మొదటిసారేం కాదు. 2018లో కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఆ వన్యప్రాణుల్ని వేటాడటం ద్వారా సల్మాన్‌ఖాన్ బిష్ణోయ్‌ల మనోభావాలను దెబ్బతీశారంటూ లారెన్స్ బిష్ణోయ్ వ్యాఖ్యానించాడు. నటుడిని చంపేస్తామంటూ ప్రకటించాడు. అయితే, చివరకు ఈ కేసులో సల్మాన్ నిర్దోషిగా విడుదలయ్యారు.
గతేడాది పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత సల్మాన్‌కు బెదిరింపు లేఖ వచ్చింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్ భద్రతను కూడా పెంచింది. అప్పటికే ఉన్న ఎక్స్ గ్రేడ్ భద్రతను Y+గా అప్‌గ్రేడ్ చేసింది. దీంతో ఇద్దరు సాయుధ గార్డ్లు సల్మాన్‌కు అనునిత్యం భద్రతగా ఉంటున్నారు. ఆయన ఇంటి వద్ద కూడా ఇద్దరు భద్రతా సిబ్బంది నిత్యం పహారా కాస్తున్నారు. ఆ తర్వాత మరికొందరు దుండగులు సల్మాన్ ఖాన్‌తోపాటు ఆయన తండ్రి సలీం ఖాన్‌ను చంపేస్తామని లేఖలు కూడా పంపారు. తాజాగా మరోసారి బెదిరింపులతో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
కాగా, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (gangsters Lawrence Bishnoi) ప్రస్తుతం ఢిల్లీ జైలులో ఉన్న విషయం తెలిసిందే. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు రావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
Also Read..
India Corona | దేశంలో మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసులు.. గత 24 గంటల్లో ఎన్ని కేసులంటే..?
Aishwaryaa Rajinikanth | ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో చోరీ.. లాకర్లోని బంగారు, వజ్రాభరణాలు మాయం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

