North Korea: గోల్డెన్ డోమ్‌తో అంతరిక్ష అణు యుద్ధం: ఉత్తర కొరియా
North Korea: గోల్డెన్ డోమ్ రక్షణ కవచం వల్ల.. అంతరిక్ష అణ్వాయుధ యుద్ధాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఉత్తర కొరియా పేర్కొన్నది. గోల్డెన్ డోమ్ కవచంతో.. తమ అణ్వాయుధ సామర్థ్యం తగ్గిపోతుందని ఉత్తర కొరియా చెప్పింది. ఆ కవచాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ఆయుధాలను డెవలప్ చేయాల్సి ఉంటుందని ఉత్తర కొరియా తెలిపింది.
ప్యోంగ్యాంగ్: బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణుల నుంచి రక్షణ కల్పించేందుకు అమెరికా సర్కారు గోల్డెన్ డోమ్‌ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దీనిపై ప్రకటన చేశారు. గోల్డెన్ డోమ్ రక్షణ కవచం.. అంతరిక్ష అణ్వాయుధ యుద్ధానికి దారి తీసే అవకాశాలు ఉన్నట్లు ఉత్తర కొరియా(North Korea) పేర్కొన్నది. ఉత్తర కొరియాకు చెందిన విదేశాంగ శాఖ ఆ డోమ్ వార్తలపై స్పందిస్తూ మూర్ఖత్వంతో అమెరికా అలా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించింది. అంతరిక్షాన్ని సైనిక క్షేత్రంగా మారుస్తున్నట్లు ఉత్తర కొరియా పేర్కొన్నది. ట్రంప్ వేసిన ప్లాన్‌తో ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల సమీకరణ పెరుగుతుందని నార్త్ కొరియా వెల్లడించింది. అమెరికా, దక్షిణ కొరియా నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలను కూడా ఉత్తర కొరియా తప్పుపట్టింది.
అమెరికా నిర్మిస్తున్న గోల్డెన్ డోమ్ కవచంతో .. తమ అణ్వాయుధ సామర్థ్యం తగ్గిపోతుందని ఉత్తర కొరియా చెప్పింది. కొరియా యూనివర్సిటీకి చెందిన సీనియర్ విశ్లేషకుడు హంగ్ మిన్ తెలిపారు. మిస్సైల్ రక్షణ వ్యవస్థను ఒకవేళ అమెరికా పూర్తి చేస్తే, అప్పుడు ఆ కవచాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ఆయుధాలను డెవలప్ చేయాల్సి ఉంటుందని ఉత్తర కొరియా తెలిపింది. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నట్లు 2022లో ఉత్తర కొరియా చట్టాన్ని పాస్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలు సందర్భాల్లో బాలిస్టిక్, క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
Kamal Hassan | దేశ విధానాలను బిలియనీర్లు నిర్దేశించలేరు.. ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ కౌంటర్..!
Srinidhi Shetty | ఒక్కో సినిమాకు రూ.8 కోట్లు తీసుకుంటున్నానా .. ప్రచారాలపై శ్రీనిధి శెట్టి క్లారిటీ..!
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

