North Korea | సియోల్, మే 29: పొరుగున ఉన్న దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా ‘చెత్త’ దాడికి పాల్పడింది. పెద్దయెత్తున చెత్త, ఇతర విసర్జకాలతో ఉన్న మూటలతో కూడిన బెలూన్లను సరిహద్దు వెంబడి ఎగురవేసి దక్షిణ కొరియా గనగతలంలోకి పంపింది. ఈ చర్యను దక్షిణ కొరియా తీవ్రంగా ఖండించింది.
దీంతో ఆ దేశ మిలటరీ అధికారులు రంగంలోకి దిగి ఆ బెలూన్లను సేకరించడం ప్రారంభించారు. వాటిని ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవద్దని ప్రజలకు అడ్వయిజరీ జారీ చేశారు. బుధవారం నాటికి 150 బెలూన్లను గుర్తించామన్నారు. అందులో చాలామటుకు నేలపై పడగా, మరికొన్ని గగనతలంలోనే విహరిస్తున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది.