North Korea: ధ్వని వేగం కన్నా 12 రెట్ల అధిక వేగంతో .. హైపర్సోనిక్ వార్‌హెడ్‌ను పరీక్షించిన నార్త్‌కొరియా
North Korea: ధ్వని వేగం కన్నా 12 రెట్ల అధిక వేగంతో ప్రయాణించే మిస్సైల్‌ను నార్త్‌కొరియా పరీక్షించింది. ఆ బాలిస్టిక్ క్షిపణితో హైపర్సోనిక్ వార్‌హెడ్‌ను కూడా పరీక్షించారు. పసిఫిక్ తీరంలోని శత్రు దేశాలను తమ వార్‌హెడ్ టార్గెట్ చేయగలదని దేశాధినేత కిమ్ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: ఇంటర్మీడియేట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని సోమవారం ఉత్తర కొరియా(North Korea) పరీక్షించింది. అయితే ఆ మిస్సైల్‌కు.. హైపర్సోనిక్ వార్‌హెడ్ ఉన్నట్లు ఆ దేశం వెల్లడించింది. ఆ ఆయుధంతో పసిఫిక్ తీరంలోని శత్రు దేశాలను చిత్తు చేయవచ్చు అని నార్త్ కొరియా పేర్కొన్నది. ధ్వని వేగం కన్నా అధిక వేగంతో ప్రయాణించే వాటిని హైపర్సోనిక్ అని పిలుస్తాం. అయితే అలాంటి మిస్సైల్స్‌ను ట్రాక్ చేసి, షూట్ చేయడం కష్టమైన పని. ధ్వని వేగం కన్నా అయిదు రెట్లు అధికం వేగంతో వెళ్లడం వల్ల వాటిని కూల్చడం వీలు కాదు.
అయితే సోమవారం ఉత్తర కొరియా పరీక్షించిన హైపర్సోనిక్ వార్‌హెడ్.. ధ్వని వేగం కన్నా సుమారు 12 రెట్ల వేగంతో వెళ్తుందని తేలింది. దాదాపు 1500 కిలోమీటర్ల దూరం ఆ క్షిపణి ప్రయాణించింది. గత ఏడాది ఏప్రిల్‌లో కూడా ఉత్తర కొరియా ఇలాగే హైపర్సోనిక్ మిస్సైల్స్‌ను పరీక్షించినట్లు తెలుస్తోంది. కొత్తగా పరీక్షించిన హైపర్సోనిక్ క్షిపణి లో.. కొత్త తరహా ఫ్లయిట్, గైడెన్స్ కంట్రోల్ వ్యవస్థ ఉన్నట్లు చెప్పింది.
కార్బన్ ఫైబర్‌తో చేసిన కొత్త ఇంజిన్ కొత్త మిస్సైల్‌లో ఉన్నది. సోమవారం జరిగిన పరీక్ష గురించి ఆ దేశ నేత కిమ్ జాంగ్ ఉన్ మాట్లాడారు. తాజా పరీక్షతో శత్రువులకు తామేంటో చూపించామన్నారు. మా ప్రయోజనాలను కాపాడుకునేందుకు.. దేనికైనా సిద్ధంగా ఉంటామన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

