Nobel Prize | వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్..! కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధికి దక్కిన ఫలితం..!
Nobel Prize | వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ అవార్డు దక్కింది. వైద్యులు కాలిటన్ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు పురస్కారం వరించింది. కరోనా మహమ్మారికి కట్టడికి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధి కోసం చేసిన కృషికి కాలిటన్ కరికో, డ్రూ వెయిస్మన్గాను ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసినట్లు నోబెల్ అసెంబ్లీ పేర్కొంది.
Nobel Prize | వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ అవార్డు దక్కింది. వైద్యులు కాలిటన్ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు పురస్కారం వరించింది. కరోనా మహమ్మారికి కట్టడికి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధి కోసం చేసిన కృషికి కాలిటన్ కరికో, డ్రూ వెయిస్‌మన్‌ను ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసినట్లు నోబెల్ అసెంబ్లీ పేర్కొంది. ‘కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా సమర్థవంతంగా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధి చేయడానికి సహాయపడే న్యూక్లియోసైడ్ బేస్‌కు సంబంధించిన ఆవిష్కరణలకు’ నోబెల్‌తో గౌరవిస్తున్నట్లు జ్యూరీ పేర్కొంది.
కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లోని 50 మంది ప్రొఫెసర్లతో కూడిన నోబెల్ అసెంబ్లీ ఏటా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందజేస్తున్నది. మానవజాతి ప్రయోజన కోసం వైద్యరంగంలో గణనీయమైన కృషి చేసిన శాస్త్రవేత్తలను జ్యూరీ గుర్తిస్తుంది. స్జోల్నోక్‌లో 1955లో జన్మించిన కటాలిన్ కరిక్ స్జెడ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెససర్‌గా, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో పెరెల్మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో అనుబంధ ప్రొఫెసర్‌గా ఉన్నారు.
డ్రూ వెయిస్‌మన్ పెన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా.. 1901 నుంచి ఇప్పటివరకు ఫిజియాలజీ, మెడిసిన్‌లో 113 నోబెల్ ప్రదానం చేయగా.. ఇందులో పన్నెండింటిని మహిళలు అందుకున్నారు. అత్యంత పిన్న వయస్కుడైన నోబెల్ గ్రహీతగా ఫ్రెడరిక్ జీ బాంటింగ్ నిలిచారు. 32 సంవత్సరాల వయస్సులో ఇన్సులిన్‌ను కనుగొన్నందుకు 1923 అవార్డును అందుకున్నారు. గతేడాది 2022లో మెడిసిన్‌లో నోబెల్‌ను స్వీడిష్ జన్యు శాస్త్రవేత్త స్వాంటే పాబోకు లభించింది. ఇదిలా ఉండగా.. ఈ వారంలో నోబెల్ పురస్కారాలను ప్రకటించనుండగా.. డిసెంబర్ 10న ప్రదానం చేయనున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

