Nobel Peace Prize | ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం వెనిజుల ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడోకు దక్కింది. దాంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ కల చదిరిపోయింది. ఈ క్రమంలో ఈ అవార్డుపై వైట్ హౌస్ స్పందించింది. డొనాల్డ్ ట్రంప్‌కు బదులుగా వెనిజులా ప్రతిపక్ష నాయకురాలికి శాంతి పురస్కారాన్ని ఇవ్వాలన్న నోబెల్ కమిటీ నిర్ణయాన్ని శ్వేత సౌధం విమర్శించింది.
నోబెల్ బహుమతిని ఎంపిక చేసే ప్యానెల్ శాంతికి బదులుగా రాజకీయాలను ఎంచుకుందని పేర్కొంది. వైట్ హౌస్ ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ శాంతి ఒప్పందాలకు మధ్యవర్తిత్వం చేస్తూ యుద్ధాలను అడ్డుకుంటూ ప్రాణాలను కాపాడుతూనే ఉంటారన్నారు. ఆయనకు మనవతావాది అని.. ఆయనలాంటి వారు తన దృఢ సంకల్పంతో పర్వతాలను సైతం కదిలించగలరన్నారు.
ఇదిలా ఉండగా.. ఐరల్ లేడీగా పిలుచుకునే వెనిజుల ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో టైమ్ మ్యాగజైన్ 2025 వంద మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. వెనిజులా ప్రజాస్వామ్య హక్కుల కోసం చేసిన పోరాటంలో ఆమె కృషికి శాంతి పురస్కారంతో మచాడోను సత్కరిస్తున్నట్లు నోబెల్ కమిటీ పేర్కొంది.