లండన్: భారత సంతతికి చెందిన నోబెల్ అవార్డు గ్రహీత, ప్రొఫెసర్ వెంకీ రామకృష్ణన్‌కు యూకే ప్రతిష్ఠాత్మక అవార్డు ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ దక్కింది. ఈ పురస్కారాన్ని ఆయనకు బ్రిటన్ రాజు చార్లెస్-3 అందజేశారు. తమిళనాడులోని చిదంబరంలో జన్మించిన వెంకీ రామకృష్ణన్.. అమెరికాలో బయాలజీ విభాగంలో చదువు పూర్తి చేశారు. యూకేకు మకాం మార్చారు.