Dr Muhammad Yunus: హసీనా రాజీనామాతో.. బంగ్లాదేశ్‌కు విముక్తి: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత
Dr Muhammad Yunus: హసీనా రాజీనామాతో.. బంగ్లాదేశ్ ఫ్రీ కంట్రీగా మారినట్లు నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ మొహమ్మద్ యూనుస్ తెలిపారు. ఆమె ఉన్నంత వరకు.. బంగ్లా ఆక్రమిత దేశంగా నిలిచిందన్నారు. ఓ ఆక్రమిత శక్తి తరహాలో ఆమె వ్యవహరించినట్లు ఆయన ఆరోపించారు.
ఢాకా: బంగ్లాదేశ్ ఇప్పుడు స్వేచ్ఛను పొందినట్లు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డాక్టర్ మొహమ్మద్ యూనుస్(Dr Muhammad Yunus) తెలిపారు. ప్రధాని షేక్ హసీనా రాజీనామాతో .. ఫ్రీ కంట్రీగా మారిందన్నారు. గత కొన్ని వారాలుగా బంగ్లాలో 30 శాతం రిజర్వేషన్ కు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. షేక్ హసీనా ఉన్నన్ని రోజులూ.. ఇది ఆక్రమిత దేశంగానే ఉంటుందని, ఓ ఆక్రమిత శక్తిలా ఆమె వ్యవహరించారని, ఓ నియంతలా, ఆర్మీ జనరల్‌గా, అన్నింటినీ ఆధీనంలోకి తీసుకున్నట్లు యూనుస్ ఆరోపించారు. బంగ్లాదేశ్ ప్రజలు ఇప్పుడు విముక్తిని పొందినట్లు ఫీలవుతున్నారని ఓ ఇంటర్వ్యూలో యూనుస్ పేర్కొన్నారు.
డాక్టర్ మొహమ్మద్ యూనుస్.. సామాజిక వ్యాపారవేత్త. బ్యాంకర్, ఆర్థికవేత్త. సివిల్ సొసైటీ లీడర్. 2006లో ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ దక్కింది. గ్రామీణ బ్యాంకును కనుగొన్న ఆయనకు ఆ అవార్డును అందజేశారు. మైక్రో క్రెడిట్, మైక్రోఫైనాన్స్ లాంటి ఆలోచనలను ఆయనే క్రియేట్ చేశారు. అయితే హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ సర్కారు.. డాక్టర్ యూనుస్‌పై సుమారు 190 కేసులు పెట్టింది. తండ్రి ముజ్బిర్ రెహ్మాన్ వారసత్వాన్ని హసీనా నాశనం చేసినట్లు ఆయన ఆరోపించారు. హింస, విధ్వంసం, అల్లర్లు.. అన్నీ హసీనాపై కోపంతోనే జరిగినట్లు తెలిపారు. విధ్వంసం సృష్టించిన యువతే.. భవిష్యత్తులో దేశాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు.
ప్రతిసారీ ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడడం వల్ల.. షేక్ హసీనాను రాజకీయంగా ఎదుక్కోవడం కుదరలేదని యునుస్ తెలిపారు. 30 శాతం రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వం ఎవర్నీ పట్టించుకోలేదని, చర్చలు జరపకుండా.. మొండిగా యువతను అణిచివేసే ప్రయత్నం చేసిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న యూనుస్?. త్వరలోనే బంగ్లాదేశ్‌లో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగనున్నట్లు చెప్పారు.
బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించేందుకు డాక్టర్ యూనుస్ అంగీకరించినట్లు ఓ వీడియో మెసేజ్‌లో కీలక విద్యార్థి సంఘం నేత నహిద్ ఇస్లామ్ తెలిపారు. తాత్కాలిక ప్రభుత్వ సభ్యుల జాబితాను ఇవాళ రిలీజ్ చేయనున్నారు. బంగ్లా ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించేందుకు యూనుస్ అంగీకరించినట్లు ఓ మీడియా కథనం ద్వారా తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన రబాడా.. తక్కువ బంతులేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు..!
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

